మహిళ ప్రాణాల మీదకు తెచ్చిన వేడుకలు
- August 18, 2016
వేడుకల్లో సరదా కోసం గాల్లోకి కాల్పులు జరపడంతో ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి. గాయాలపాలైన బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. వెడ్డింగ్ సెలబ్రేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వివరించాయి. ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని, పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామనీ, కఠిన శిక్షలు కూడా విధిస్తున్నామనీ అయినా సరే వేడుకల్లో గాల్లోకి కాల్పులు జరుగుతున్న ఘటనలు మాత్రం తగ్గడంలేదని పోలీసు వర్గాలు చెప్పాయి. పెళ్ళి వేడుకలు విషాదాంతమవుతున్నాసరే, గాల్లోకి కాల్పులు జరపడాన్ని మాత్రం కొందరు మానలేకపోవడం బాధాకరమని పోలీసులు చెప్పారు. సౌదీ నిబంధనల ప్రకారం వేడుకల్లో గాల్లోకి కాల్పులు జరపడం నేరం. ఈ నేరానికిగాను వరుడ్ని అక్కడికక్కడే అరెస్ట్ చేయడానికి వీలుంది. ఎక్కువగా వరుడు గన్‌తో గాల్లోకి కాల్పులు జరపడం అనేది జరుగుతుంటుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







