నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!

- August 31, 2026 , by Maagulf
నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!

మస్కట్: నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో 51 ఏళ్ల ఒమానీ పర్వతారోహకురాలు ఫాతియా అల్ జద్‌జాలి ప్రాణాలతో బయటపడ్డారు. వరదలకు చిక్కుకుని 72 గంటల పాటు కొండపై సహాయం కోసం ఎదురుచూసిన ఆమెను నేపాల్ అధికారులు చివరకు రెండు హెలికాప్టర్ల ద్వారా రక్షించారు. యాలా పీక్‌పై ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఫాతియా.. ఆగస్టు 26న కొండ నుంచి కిందకు వస్తుండగా భారీ వరద నీరు, మట్టి ప్రవాహం గ్రామం వైపు దూసుకురావడాన్ని చూసినట్టు తెలిపారు.
తన కళ్ల ముందే హోటల్‌తో పాటు గ్రామంలోని ఇళ్లు వరదల్లో కొట్టుకుపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో కొట్టుకుపోతున్న ప్రజల కేకలు కూడా తాను విన్నానని, తన కళ్ల ముందే వారు మరణించారని అప్పటి భయానక సంఘటనలను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు.  
ఫాతియా మూడు రాత్రులు కొండపైనే చిక్కుకుపోయారు. తాము ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతం కంటే తక్కువ కాదని ఆమె పేర్కొన్నారు.
నేపాల్‌లోని హిమాలయ ప్రాంతాన్ని భారీ వరదలు, కొండచరియల విరిగిపడటం తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఇళ్లు, రహదారులు, వంతెనలు సహా భారీగా మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. వందలాది మంది మృతి చెందగా.. వేలాది మంది కనిపించకుండా పోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు  ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com