ఖతార్‌లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!

- August 31, 2026 , by Maagulf
ఖతార్‌లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!

దోహా: ఖతార్‌లో సెప్టెంబర్ 1, 2 తేదీల్లో (మంగళవారం, బుధవారం) బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఖతార్ వాతావరణ శాఖ (QMD) హెచ్చరించింది. ఈ రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఉత్తర-పశ్చిమ దిశ నుంచి వేగంగా గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో దుమ్ముతో కూడిన గాలులు ఏర్పడి, రహదారులపై విజిబిలిటీ గణనీయంగా తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అలాగే సముద్రంలోనూ ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో మెరైన్ వార్నింగ్ జారీ చేశారు.ప్రజలు ముఖ్యంగా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, దుమ్ము కారణంగా విజిబిలిటీ తగ్గిన సమయంలో వేగాన్ని తగ్గించి ప్రయాణించాలని అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com