భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- August 31, 2026
అబుదాబి: భారతీయ పర్యాటకులకు అబుదాబి ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. అబుదాబిలో కనీసం 3 నైట్స్ హాలిడే ప్యాకేజీ బుక్ చేసుకుంటే యూఏఈ ఎంట్రీ వీసాను ఉచితంగా పొందే అవకాశం కల్పించింది. ఈ కొత్త టూరిజం కార్యక్రమాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం – అబుదాబి (DCT Abu Dhabi) ప్రారంభించింది. ఈ ఆఫర్ 2026 ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకు అమల్లో ఉంటుంది. ప్రారంభ దశలో గరిష్ఠంగా 20 వేల వీసాలకు ఈ పథకం వర్తించనుంది.
ఎవరికి వర్తిస్తుంది?
భారత్ నుంచి ప్రయాణించే భారతీయ పాస్‌పోర్ట్‌దారులు ఈ ఆఫర్‌కు అర్హులు. అయితే కొన్ని షరతులు తప్పనిసరిగా పాటించాలి:
DCT Abu Dhabiతో భాగస్వామ్యం ఉన్న ట్రావెల్ ఏజెన్సీ లేదా ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా బుకింగ్ చేయాలి.
అబుదాబిలోని హోటల్‌లో వరుసగా కనీసం 3 రాత్రులు బస చేయాలి.
భారత్ నుంచి వెళ్లి తిరిగి భారత్‌కు వచ్చే రిటర్న్ ఫ్లైట్ ఉండాలి.
వీసా ఖర్చు పూర్తిగా ఉచితం
అర్హత ఉన్న హాలిడే ప్యాకేజీని బుక్ చేసుకున్న ప్రయాణికుల నుంచి యూఏఈ ఎంట్రీ వీసాకు అదనపు రుసుము వసూలు చేయరు. అర్హత ఉన్న బుకింగ్‌లకు వీసా ఖర్చును DCT Abu Dhabi భరిస్తుంది.
ట్రావెల్ భాగస్వాములు వీసా ప్రాసెసింగ్ కోసం DCT నియమించిన డెస్టినేషన్ మేనేజ్‌మెంట్ కంపెనీ ద్వారా పనిచేయవచ్చు. ఈ విధానంలో వీసా ఖర్చును DCT నేరుగా భరిస్తుంది. మరో విధానంలో ట్రావెల్ కంపెనీలు తమ ప్రస్తుత భాగస్వాములతోనే పనిచేయవచ్చు. ఈ సందర్భంలో ఒక్కో వీసాకు Dh285 చొప్పున DCT రీయింబర్స్ చేస్తుంది.
భారత్ కీలక మార్కెట్
మూడు నెలల పైలట్ కార్యక్రమంలో 20వేల వీసాల వరకు ఈ పథకానికి మద్దతు ఇవ్వనున్నట్లు DCT Abu Dhabi తెలిపింది. భారత పర్యాటక మార్కెట్‌కు మరింత ప్రాధాన్యత ఇవ్వడం, విమాన కనెక్టివిటీని పెంచడం, ట్రావెల్ భాగస్వామ్యాలను విస్తరించడం, భారతీయ ప్రయాణికులకు అబుదాబిని మరింత అందుబాటులోకి తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలని అధికారులు తెలిపారు. భారతీయ పర్యాటకులు అబుదాబి సంస్కృతి, వినోదం, ఆతిథ్యం, ప్రకృతి అందాలను ఎక్కువ కాలం ఆస్వాదించేలా ఈ కార్యక్రమం దోహదపడుతుందని DCT Abu Dhabi పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్‌మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్‌లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- కువైట్‌లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్‌లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్







