21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్‌లో టాప్..!!

- August 31, 2026 , by Maagulf
21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్‌లో టాప్..!!

రియాద్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గుర్తింపు పొందిన ఆరోగ్యకరమైన నగరాల సంఖ్యలో సౌదీ అరేబియా తూర్పు మధ్యధరా, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో WHO గుర్తింపు పొందిన హెల్తీ సిటీల సంఖ్య 21కి చేరింది. నగరాల అభివృద్ధిలో ప్రజల ఆరోగ్యం, జీవన నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ సౌదీ అరేబియా చేపడుతున్న చర్యలకు ఇది నిదర్శనమని అధికారులు తెలిపారు.
ఆరోగ్యకరమైన నగరాల కార్యక్రమం ద్వారా వ్యాధుల నివారణ, ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యం, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం, ఆరోగ్య సేవల అభివృద్ధితో పాటు పట్టణ పర్యావరణాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారిస్తున్నారు. సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న హెల్తీ సిటీస్ ప్రోగ్రామ్ ఈ ప్రాంతంలో WHO సహకార కేంద్రంగా గుర్తింపు పొందిన తొలి కార్యక్రమం కాగా, ప్రపంచవ్యాప్తంగా నాలుగోది.
ఈ కార్యక్రమం ఆరోగ్యాన్ని కేవలం ఆసుపత్రులు, వైద్య సేవలకు పరిమితం చేయకుండా పట్టణ ప్రణాళిక, విద్య, పర్యావరణం, ప్రజల రోజువారీ జీవన విధానం వంటి అంశాలతో అనుసంధానం చేస్తోంది. దీంతో ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడంతో పాటు ఆరోగ్యకరమైన సమాజాల నిర్మాణానికి సౌదీ అరేబియా మరింత ముందుకు సాగుతోందని అధికారులు పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com