ఒమన్‌లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- August 31, 2026
మస్కట్: ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వైద్య సేవల ఫీజులకు సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. “ఒమన్ పౌరుల మరణ కేసులు” అనే కొత్త కేటగిరీని వైద్య సేవల ఫీజుల చెల్లింపు నుంచి మినహాయించిన వర్గాల్లో చేర్చింది. ఆరోగ్య మంత్రి డాక్టర్ హిలాల్ బిన్ అలీ అల్ సబ్తీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి మంత్రివర్గం, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదాలు కూడా లభించాయి. కొత్త కేటగిరీని చేర్చడంతో ఒమన్‌లో అన్ని చికిత్సా సేవల ఫీజుల నుంచి పూర్తిగా మినహాయింపు పొందే వర్గాల సంఖ్య 18కు చేరింది.
ఇప్పటికే ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే కొన్ని అంటువ్యాధులతో బాధపడుతున్న రోగులు, అవయవ దాతలు, సామాజిక భద్రతా ప్రయోజనాలు పొందుతున్న వారు, వారి కుటుంబ సభ్యులు, నమోదైన అనాథలు, ఒమన్ పౌరులైన దివ్యాంగులు, రెండేళ్లలోపు ఒమన్ పిల్లలు ఈ మినహాయింపు కేటగిరీల్లో ఉన్నారు. అలాగే జాతీయ టీకా కార్యక్రమాలు, ముందస్తు ఆరోగ్య పరీక్షల కార్యక్రమాల లబ్ధిదారులు, ఒమన్ గర్భిణులు, ప్రసూతి మరియు శిశు సంరక్షణ సేవలకు అర్హులైన కొన్ని వర్గాలకు కూడా వైద్య సేవల ఫీజుల నుంచి మినహాయింపు ఉంది.
అలాగే దీర్ఘకాలిక డయాలసిస్ లేదా క్యాన్సర్ చికిత్స పొందుతున్న ఒమన్ పౌరులు, ఖైదీలు, విచారణకు ముందు నిర్బంధంలో ఉన్నవారు కూడా ఈ మినహాయింపుల పరిధిలో ఉన్నారు.
తాజాగా ఒమన్ పౌరుల మరణ కేసులను ప్రత్యేకంగా మినహాయింపు వర్గంలో చేర్చడం ద్వారా వైద్య సేవల ఫీజులకు సంబంధించిన నిబంధనల్లో మరో మార్పు చోటుచేసుకుంది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- ఒమన్‌లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్‌లో వాట్సాప్ మెసేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్‌లో విషాదం.. బాత్‌టబ్‌లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక
- మహిళ వద్ద రూ. 25 కోట్ల విలువైన 15.6 కిలోల గోల్డ్ సీజ్!
- విశాఖలో ఏఐజీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన
- అల్ మెన్హాద్ ఎయిర్‌బేస్‌పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ







