పీవీపీ సినిమా బడ్జెట్ రూ. 60కోట్లు...
- August 18, 2016
పీవీపీ. పొట్లూరి వరప్రసాద్. బడా బిజినెస్ మ్యాన్. సినీ నిర్మాతగా కూడా టర్న్ తీసుకున్నారు. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత అనిపించుకున్నారు. క్షణం తప్పితే .. దాదాపు భారీ సినిమాలే తీశారు. ఆయన బడ్జెట్ లెక్క కూడా వేరు. లేడీ ఓరియెంటెడ్ సినిమా "వర్ణ"కు దాదాపు రూ. 60కోట్లు ఖర్చుపెట్టారంటే ఆయన భారీదనం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.
ఇప్పటివరకూ ఆయనకు డబ్బులు తెచ్చిపెట్టిన సినిమా ఏదీ కనిపించదు. "ఊపిరి"సినిమాకి మంచి వసూళ్ళు దక్కాయి గానీ అధిక బడ్జెట్ తో దానికి బ్యాలెన్స్ అయిపోయిందని ట్రేడ్ వర్గాలు లెక్కలు చెప్పాయి. బ్రహ్మోత్సవం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారీగా ముంచేసిందా సినిమా.అయితే పీవీపీ మాత్రం క్కడా తగ్గడం లేదు. తాజాగా కార్తీతో కాష్మోరా" సినిమా నిర్మిస్తున్నారాయన. ఈ సినిమాకు బడ్జెట్ రూ. 60కోట్ల వరకూ పెట్టేస్తున్నారట. ఇదీ రిస్క్. కార్తీకి ఇంత మార్కెట్ లేదు. సినిమాకి హిట్ టాక్ వస్తే.. రెండు భాషలు కలుపుకొని 40కోట్లు వరకూ రావచ్చని అంచనా. మరో పది శాటిలైట్ కి వేసుకున్న ఇంకో పది కోట్లు రికవరీ చేసుకోవడం కత్తిమీద సామే. ఈలాంటి పరిస్థితిలో 60కోట్లు పెడుతున్నారంటే రిస్క్ చేస్తున్నాట్లే లెక్క. మరి ఆయన లెక్కలు ఎలా వున్నాయో.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







