కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- September 01, 2026
కాశీ: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ వేడుకలను ఆగస్టు 29 నుంచి 31 వరకు నిర్వహించిన కాశీ తెలుగు సంగమం సందర్భంగా ఘనంగా నిర్వహించారు. తెలుగు సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా జరిగిన ఈ వేడుకల్లో తెలుగు సమాజానికి చెందిన పలువురు పాల్గొన్నారు.
కాశీ తెలుగు సంగమం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బోనాల వేడుకల్లో సంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకున్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
తెలుగు ప్రజలకు ఎక్కడ, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఆదిలీల ఆర్గనైజేషన్ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని నిర్వాహకులు తెలిపారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ వాటిని భావితరాలకు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ బోనాల పండుగ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ, అలాగే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
“తెలుగు సంస్కృతి మన గర్వం.. తెలుగు వారి ఐక్యత మన బలం” అనే సందేశంతో కాశీ తెలుగు సంగమం సందర్భంగా నిర్వహించిన బోనాల వేడుకలు ఉత్సాహంగా ముగిశాయి.

తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







