ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- September 02, 2026
అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య సంబంధాలు మరోసారి అత్యంత క్లిష్టమైన దశకు చేరుకున్నాయి. ఇరాన్‌కు చెందిన శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం తాజాగా భీకర దాడులు నిర్వహించింది. ఈ వైమానిక దాడులకు సంబంధించిన అధికారిక ప్రకటనను అమెరికా సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా ప్రపంచానికి వెల్లడించింది. ఈ తాజా పరిణామంతో పశ్చిమాసియాలో మరోమారు యుద్ధ వాతావరణం నెలకొంది.
ప్రతీకార చర్యగా అమెరికా దాడులు–హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు
హర్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై, అలాగే పశ్చిమాసియా ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ నిరంతరం దాడులకు పాల్పడుతోంది. ఈ దుశ్చర్యలకు ప్రతీకారంగానే తాము ఈ సైనిక చర్య చేపట్టామని అమెరికా స్పష్టం చేసింది. దాదాపు నెల రోజుల పాటు స్వల్ప విరామం ఇచ్చిన ఇరు దేశాల మధ్య, ఇప్పుడు మళ్లీ సైనిక ఘర్షణలు పునఃప్రారంభం కావడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







