కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!

- September 02, 2026 , by Maagulf
కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!

కువైట్ : కువైట్ రాజధాని ప్రాంతంలోని ఓ నివాస సముదాయంలో తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే జనరల్ ఫైర్ ఫోర్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.

జనరల్ ఫైర్ ఫోర్స్ అధికారిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అల్-ఘరీబ్ మాట్లాడుతూ..  ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక బృందాలు వేగంగా స్పందించి సహాయక చర్యలు చేపట్టాయని తెలిపారు.

అగ్నిమాపక సిబ్బంది మంటలు మరింత వ్యాపించకుండా నియంత్రించి పూర్తిగా ఆర్పివేశారని చెప్పారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, కేవలం ఆస్తి నష్టం మాత్రమే సంభవించిందని అధికారులు వెల్లడించారు.

ప్రస్తుత భద్రతా పరిస్థితుల నేపథ్యంలో అత్యవసర ఘటనలకు వెంటనే స్పందించేందుకు, ప్రజల ప్రాణాలు మరియు ఆస్తులను రక్షించేందుకు జనరల్ ఫైర్ ఫోర్స్ పూర్తిస్థాయి సంసిద్ధతతో ఉందని అల్-ఘరీబ్ స్పష్టం చేశారు. కాగా, ఈ ఘటనకు శత్రు డ్రోన్ కారణం అయిండొచ్చని భావిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com