కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు

- September 03, 2026 , by Maagulf
కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు

కువైట్: కువైట్‌పై ఇరాన్ నుంచి క్షిపణులు, డ్రోన్ల దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో కువైట్ సాయుధ దళాలు అప్రమత్తమయ్యాయి. గురువారం తెల్లవారుజామున దేశ గగనతలంలోకి దూసుకొచ్చిన ఇరాన్‌కు చెందిన క్షిపణులు, డ్రోన్లను తమ వాయు రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయని కువైట్ సాయుధ దళాలు ప్రకటించాయి.

కువైట్ న్యూస్ ఏజెన్సీ (KUNA) ద్వారా విడుదలైన ప్రకటనలో, దేశంలోని పలు ప్రాంతాల్లో వినిపిస్తున్న భారీ పేలుళ్ల శబ్దాలు వాయు రక్షణ చర్యల్లో భాగమేనని సైన్యం వెల్లడించింది.

గగనతలంలోకి ప్రవేశిస్తున్న శత్రు లక్ష్యాలను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేసేందుకు రక్షణ వ్యవస్థలు నిరంతరం పనిచేస్తున్నాయని పేర్కొంది. ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, పరిస్థితిని సైన్యం నిశితంగా పర్యవేక్షిస్తోందని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com