డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- September 03, 2026
న్యూ ఢిల్లీ: ఉత్తర తెలంగాణ ప్రజల దశాబ్దాల నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. వరంగల్ మామునూరు విమానాశ్రయ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి రాబోయే రెండు వారాల్లో టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు. అంతేకాకుండా, అంతా అనుకున్నట్లు జరిగితే రాబోయే డిసెంబర్ నెలలోనే విమానాశ్రయ నిర్మాణానికి అధికారికంగా శంకుస్థాపన చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఓరుగల్లు నగరం పారిశ్రామికంగా, రవాణా పరంగా తీవ్ర పురోగతి సాధిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







