ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్‌ మూసివేత..!!

- September 03, 2026 , by Maagulf
ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్‌ మూసివేత..!!

దోహా: గడువు ముగిసిన ఆహార పదార్థాలను వినియోగించినట్లు గుర్తించడంతో ఖతార్ మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ ఓ హోటల్‌లోని రెస్టారెంట్‌ను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించింది.

అల్ షహానియా మున్సిపాలిటీ పరిధిలోని రాస్ అబ్రూక్ హోటల్లో ఉన్న రెస్టారెంట్‌ను ఏడు రోజుల పాటు మూసివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులను వినియోగించడం ఈ ఉల్లంఘనకు కారణమని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

అంతేకాకుండా, ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా సంస్థను మూసివేసినట్లు ప్రజలకు తెలియజేసే బోర్డును రెస్టారెంట్ వద్ద ఏర్పాటు చేయాలని కూడా అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com