అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన

- September 03, 2026 , by Maagulf
అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన

అమరావతి: రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి యంత్రాంగాన్ని సంసిద్ధం చేయడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మంత్రులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కొత్త పింఛన్ల పంపిణీ, పరిపాలనాపరమైన పలు కీలక అంశాలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు.

అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లు మరియు స్థానిక ఎన్నికల షెడ్యూల్

రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి అక్టోబర్ నెల నుంచి దశలవారీగా కొత్త పింఛన్లు అందించాలని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి జాప్యం లేకుండా పారదర్శకంగా లబ్ధి చేకూర్చాలని అధికారులకు సూచించారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేసే ప్రసక్తే లేదని, అక్టోబర్ నాటికే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని తేల్చిచెప్పారు. కోర్టుల్లో ఉన్న పెండింగ్ అంశాలను చట్టబద్ధంగా పరిష్కరిస్తున్నామని, ముందుగా మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, చివరగా పంచాయతీ ఎన్నికలు క్రమపద్ధతిలో నిర్వహిస్తామని వెల్లడించారు. ఎన్నికలను అడ్డుకోవాలని చూసే ప్రత్యర్థుల కుయుక్తులు సాగవని హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com