బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!

- September 04, 2026 , by Maagulf
బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!

మనామా: బహ్రెయిన్‌లోని చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలకు ఈ ఏడాది తొలి ఎనిమిది నెలల్లో దాదాపు 3.94 లక్షల సందర్శనలు నమోదయ్యాయి. బహ్రెయిన్ ఫోర్ట్‌ ఒక్కటే మొత్తం సందర్శనల్లో దాదాపు మూడింట రెండొంతులు ఆకర్షించడం విశేషం. బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ యాంటిక్విటీస్ గణాంకాల ప్రకారం.. జనవరి నుంచి ఆగస్టు 2026 వరకు మొత్తం 3,93,536 సందర్శనలు నమోదయ్యాయి. ఇందులో బహ్రెయిన్ ఫోర్ట్‌కు 2,46,409 సందర్శనలు వచ్చాయి. ఇది మొత్తం సందర్శనల్లో సుమారు 63 శాతంగా ఉంది. బహ్రెయిన్ ఫోర్ట్ తర్వాత ట్రీ ఆఫ్ లైఫ్, విజిటర్ సెంటర్‌కు 64,561 మంది, బహ్రెయిన్ నేషనల్ మ్యూజియంకు 37,020 మంది సందర్శకులు వచ్చారు.

విదేశీ సందర్శకులు అత్యధికంగా 1,87,567 మంది ఉండగా, బహ్రెయిన్ పౌరులు 99,099 మంది ఉన్నారు. టూరిస్ట్ ఏజెన్సీల ద్వారా 59,681 సందర్శనలు నమోదయ్యాయి. అరబ్ దేశాల నుంచి 17,324, GCC దేశాల నుంచి 15,877 సందర్శనలు వచ్చాయి. ఆర్గనైజ్డ్ గ్రూపుల ద్వారా 6,918, ప్రైవేట్ పాఠశాలల నుంచి 4,054, నర్సరీల నుంచి 1,123 సందర్శనలు నమోదయ్యాయి. విభాగాల వారీగా చూస్తే పురావస్తు ప్రదేశాలు 2,56,813 సందర్శనలతో మొదటి స్థానంలో ఉన్నాయి. మ్యూజియంలకు 42,153, పెర్లింగ్ పాత్ ప్రాంతాలకు 11,641, కోటలకు 2,839, హస్తకళల ప్రదేశాలకు 2,537 సందర్శనలు నమోదయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com