ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్

- September 05, 2026 , by Maagulf
ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్

న్యూ ఢిల్లీ: ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగుల సోషల్ మీడియా కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర దృష్టి సారించింది. విధి నిర్వహణలో ఉంటూ రీల్స్ చేయడం, వీడియోలు తీయడం, ప్రభుత్వంపై వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేయడం లేదా స్వయం ప్రచార కంటెంట్‌ను (Self-Promotional Content) పోస్ట్ చేయడాన్ని నియంత్రించేందుకు నూతన నిబంధనలు తీసుకరానుంది. ప్రభుత్వ రంగ వ్యవస్థల గౌరవం, పనితీరు దెబ్బతినకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ‘కోడ్ ఆఫ్ కండక్ట్’ (Code of Conduct) రూపకల్పన చేసే దిశగా అడుగులు వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఈ ప్రతిపాదనపై ఉన్నతాధికారుల స్థాయిలో ఇప్పటికే కీలక చర్చలు వేగవంతమయ్యాయి.

అన్ని స్థాయిల సిబ్బందికి వర్తింపు: నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

ఈ నూతన సోషల్ మీడియా నిబంధనలు ఖరారైతే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని స్థాయిల ఉద్యోగులకు, అధికారులకు ఇవి వర్తించే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో ప్రభుత్వ ఆఫీసుల్లో విధులను పక్కనపెట్టి రీల్స్ చేస్తూ, వాటిని సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసే సంస్కృతి పెరిగిపోవడంపై ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తోంది. అధికారిక సమయం దుర్వినియోగం కాకుండా చూడటం, అధికారిక సమాచార భద్రతను కాపాడటమే ఈ నూతన కోడ్ ఆఫ్ కండక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒకవేళ నిబంధనలు అమలులోకి వచ్చాక వీటిని ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకునే విధంగా కఠిన నిబంధనలను పొందుపరచనున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com