‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ

- September 04, 2026 , by Maagulf
‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్  భేటీ

దుబాయ్: యూఏఈలో నిర్వహించిన ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలను యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధానమంత్రి, దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ యూనియన్ హౌస్‌లో కలిశారు.

ఈ ఏడాది నిర్వహించిన పోటీలో యూఏఈ వ్యాప్తంగా 8.30 లక్షల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. దీంతో పోటీ చరిత్రలోనే అత్యధికంగా విద్యార్థులు పాల్గొన్న కొత్త రికార్డు నమోదైంది.

విజేతలను కలిసిన సందర్భంగా షేక్ మహమ్మద్ బిన్ రషీద్ విద్యార్థులను అభినందించారు. పఠనంపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించడంతో పాటు జ్ఞానం, సృజనాత్మకత, ఆలోచనా శక్తిని అభివృద్ధి చేయడంలో ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ కీలక పాత్ర పోషిస్తోంది.

యూఏఈలో విద్యార్థుల్లో పుస్తక పఠన సంస్కృతిని ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఏడాది భారీ స్పందన లభిస్తోంది. ఈ ఏడాది 8.30 లక్షలకు పైగా విద్యార్థుల భాగస్వామ్యం దేశంలో పఠన సంస్కృతికి పెరుగుతున్న ఆదరణను ప్రతిబింబిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com