సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- September 06, 2026
రియాద్: సౌదీ అరేబియాలో అక్రమంగా నివసిస్తున్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 2 వరకు వారం రోజుల్లో మొత్తం 14,165 మంది అక్రమ నివాసితులను అరెస్ట్ చేసినట్లు సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అరెస్టయిన వారిలో 7,121 మంది రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించినవారు, 3,636 మంది సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించినవారు, 3,408 మంది కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినవారు ఉండగా.. ఇక చట్టవిరుద్ధంగా దేశంలో ఉన్న 12,363 మందిని బహిష్కరించినట్లు అధికారులు తెలిపారు. మరో 18,937 మంది ఉల్లంఘనకారులను ప్రయాణ పత్రాల కోసం వారి దౌత్య కార్యాలయాలకు పంపించారు. మరో 3,240 మందిని ప్రయాణ ఏర్పాట్లు పూర్తి చేసేందుకు సంబంధిత విభాగాలకు తరలించినట్లు పేర్కొన్నారు.
సౌదీ సరిహద్దుల్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 1,315 మందిని కూడా అరెస్ట్ చేశారు. వీరిలో 41 శాతం మంది యెమెన్ పౌరులు, 58 శాతం మంది ఇథియోపియా పౌరులు కాగా.. మిగిలిన ఒక శాతం ఇతర దేశాలకు చెందినవారు ఉన్నారు. అదేవిధంగా సౌదీ నుంచి అక్రమంగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన 42 మందిని అధికారులు అరెస్ట్ చేశారు.అక్రమ నివాసితులకు రవాణా, ఆశ్రయం లేదా ఉద్యోగం కల్పించిన 21 మందిని కూడా అరెస్ట్ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
అక్రమంగా వ్యక్తులను సౌదీలోకి ప్రవేశించేందుకు సహాయం చేయడం, వారికి రవాణా కల్పించడం, ఆశ్రయం ఇవ్వడం లేదా ఇతర సహాయం అందించడం వంటి చర్యలకు 15 ఏళ్ల వరకు జైలు శిక్ష, గరిష్ఠంగా SR1 మిలియన్ జరిమానా విధించవచ్చని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అక్రమ నివాసితులు లేదా ఇతర ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు అధికారులకు తెలియజేయాలని సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది.మక్కా, రియాద్, తూర్పు ప్రావిన్స్‌లలో 911కు, మిగిలిన సౌదీ ప్రాంతాల్లో 999 లేదా 996కు ఫోన్ చేసి సమాచారం తెలపాలని కోరింది.
తాజా వార్తలు
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్‌వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!
- శ్వాస విధానం నిర్ణయాలపై ప్రభావం చూపుతుందా? ఆసక్తికర అధ్యయనం..!!
- మస్కట్ విమానాశ్రయంలో ఒమానీ ప్రయాణికులే టాప్..!!
- కువైట్‌లో 48 శాతం తగ్గిన జువైనల్ క్రైమ్స్..!!
- యూఏఈ లాటరీ లక్కీ డే డ్రా ఫలితాలు.. ఇద్దరికి దక్కిన Dh100,000..!!
- సౌదీ అరేబియాకు చేరుకున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బహ్రెయిన్ రాజుతో యూఏఈ అధ్యక్షుడి భేటీ







