సౌదీ అరేబియాకు చేరుకున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- September 06, 2026
రియాద్: భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు చేరుకున్నారు. సౌదీ అరేబియాలో ఆయన ద్వైపాక్షిక పర్యటనను చేపట్టనున్నారు.
రియాద్ చేరుకున్న కీర్తి వర్ధన్ సింగ్‌కు భారత రాయబారి విపుల్, సౌదీ అరేబియా మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ వ్యవహారాల డిప్యూటీ మంత్రి డా.తారిఖ్ అల్ హమద్ సాదర స్వాగతం పలికారు.
ఈ పర్యటన సందర్భంగా భారత్–సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారం, ఇరు దేశాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మానవ వనరులు, ఉపాధి, కార్మిక సంక్షేమం తదితర రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు భావిస్తున్నారు.
భారత్–సౌదీ అరేబియా మధ్య కొనసాగుతున్న సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన కీలకంగా నిలవనుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాకు చేరుకున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బహ్రెయిన్ రాజుతో యూఏఈ అధ్యక్షుడి భేటీ
- హైదరాబాద్‌లో ఘనంగా 32వ ISOI జాతీయ సదస్సు
- రాష్ట్రంలో అతిపెద్ద పెట్టుబడికి ఒప్పందం: సీఎం రేవంత్
- దమ్మామ్ విమానాశ్రయంలో భారీ గా డ్రగ్స్ సీజ్..!!
- షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు..!!
- ఇరాన్ వాదనలను ఖండించిన ఖతార్.. యూఎన్ఓకు లేఖలు..!!
- రోడ్డు ప్రమాదంలో స్టూడెంట్ మృతి.. విద్యాశాఖ దిగ్భ్రాంతి..!!
- ఒమన్‌లో గుండె మార్పిడి సక్సెస్.. ఒకే దాతతో నలుగురికి ప్రాణదానం..!!
- 2 కిలోమీటర్లకు 40 నిమిషాలు.. యూఏఈలో మళ్లీ భారీ ట్రాఫిక్..!!







