అబుదాబిలో ఫార్మ్‌లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!

- September 08, 2026 , by Maagulf
అబుదాబిలో ఫార్మ్‌లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!

అబుదాబి: అబుదాబిలోని అల్ బహ్యా ప్రాంతంలోని ఓ ఫార్మ్‌లో సోమవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం అక్కడ కూలింగ్, స్మోక్ తొలగింపు చర్యలు కొనసాగుతున్నట్లు అబుదాబి పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. ఘటనకు సంబంధించిన వివరాలు, తదుపరి సమాచారాన్ని అధికారిక వర్గాల నుంచే తెలుసుకోవాలని అబుదాబి పోలీసులు ప్రజలకు సూచించారు.

ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 3న అబుదాబిలోని అల్ మఫ్రాక్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఓ గిడ్డంగిలో కూడా అగ్నిప్రమాదం సంభవించింది. ఇటీవల యాస్ ఐలాండ్‌లో నిర్మాణంలో ఉన్న భవనంలోనూ అగ్నిప్రమాదం చోటుచేసుకోగా, ఆ ఘటనల్లోనూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com