బహ్రెయిన్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ-బైక్‌లు నిషేధం..!!
- September 08, 2026
మనామా: బహ్రెయిన్‌లో ఎలక్ట్రిక్ బైసైకిళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగంపై ట్రాఫిక్ అధికారులు కీలక నిబంధనలు ప్రకటించారు. 16 ఏళ్లలోపు పిల్లలు ఎలక్ట్రిక్ బైసైకిళ్లు నడపడం నిషేధం అని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ స్పష్టం చేసింది. అలాగే 7 ఏళ్లలోపు పిల్లలు ఎలక్ట్రిక్ స్కూటర్లు నడపాలంటే తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పర్యవేక్షణ తప్పనిసరి. నిబంధనలు పాటించకుండా పిల్లలను నడిపిస్తే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు చట్టపరమైన బాధ్యతను ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు.
ఎలక్ట్రిక్ బైక్ నడిపేవారు సేఫ్టీ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులు హెల్మెట్‌తో పాటు భుజాలు, చేతులు, కాళ్లకు రక్షణ పరికరాలు ఉపయోగించాలని అధికారులు సూచించారు. ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్ల గరిష్ఠ వేగం గంటకు 25 కిలోమీటర్లు మాత్రమే.
అదేవిధంగా 50 కి.మీ/గంటకు మించిన వేగ పరిమితి ఉన్న రహదారులపై వీటిని నడపరాదు. ప్రధాన వాహన మార్గాలు, రోడ్డు షోల్డర్లు, అత్యవసర లేన్లలో వినియోగం నిషేధం. ట్రాఫిక్‌కు వ్యతిరేక దిశలో ప్రయాణించరాదు. మరో వ్యక్తిని ఎక్కించుకుని ప్రయాణించరాదు. తమకు లేదా ఇతరులకు ప్రమాదం కలిగించే విధంగా వాహనాన్ని నడపరాదు. అవసరమైన చోట పాదచారులు, ఇతర వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ట్రాఫిక్ డైరెక్టరేట్ సూచించింది.
పిల్లలకు ఈ నిబంధనలపై అవగాహన కల్పించడంలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలని అధికారులు తెలిపారు. నిబంధనల ఉల్లంఘనలను గుర్తించేందుకు **అవగాహన కార్యక్రమాలు, క్షేత్రస్థాయి తనిఖీలు కొనసాగుతాయని, రహదారి వినియోగదారుల భద్రతకు ముప్పు కలిగించే ఉల్లంఘనలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు కొత్త రుసుములు..!!
- బహ్రెయిన్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ-బైక్‌లు నిషేధం..!!
- అబుదాబిలో ఫార్మ్‌లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్‌లో స్వీట్‌న్డ్ డ్రింక్స్‌కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!
- ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!
- రష్యాలో ఘోర విషాదం..మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి
- 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!
- కువైట్‌లో 7,019 మంది ఉపాధ్యాయుల తొలగింపు..!!







