జర్మన్ ఎంపీలతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!

- September 08, 2026 , by Maagulf
జర్మన్ ఎంపీలతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!

బెర్లిన్: సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ జర్మనీలో అధికారిక పర్యటన సందర్భంగా జర్మన్ పార్లమెంట్ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అరబ్ దేశాల పార్లమెంటరీ గ్రూప్ చైర్మన్, జర్మన్ పార్లమెంట్ విదేశాంగ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్ అలెగ్జాండర్ రాడ్వాన్‌తో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

అనంతరం ప్రిన్స్ ఫైసల్ జర్మన్ పార్లమెంట్‌కు చెందిన పలువురు సభ్యులతో కూడా సమావేశమై చర్చలు జరిపారు. సౌదీ అరేబియా–జర్మనీ ద్వైపాక్షిక సంబంధాలతోపాటు ప్రస్తుతం మిడిలీస్టు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలు, సవాళ్లపై ఇరుపక్షాలు అభిప్రాయాలను పంచుకున్నాయి.

సమగ్ర, న్యాయమైన, శాంతియుత పరిష్కారాలు కనుగొనేందుకు సౌదీ అరేబియా మరియు భాగస్వామ్య దేశాలు చేపడుతున్న ప్రయత్నాలపై కూడా చర్చించారు. ఈ సమావేశానికి యూరోపియన్ దేశాల జనరల్ డైరెక్టరేట్ డైరెక్టర్ జనరల్ అంబాసిడర్ అబ్దుల్‌రహ్మాన్ అల్-అహ్మద్, బెర్లిన్‌లోని సౌదీ రాయబార కార్యాలయం తాత్కాలిక ఛార్జ్ డి అఫైర్స్ ఆసియా బాక్‌ధా హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com