పోలీసుల విచారణకు హాజరైన యూట్యూబర్ రమా నందన
- September 08, 2026
హైదరాబాద్: ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ‘నందూస్ వరల్డ్’ నిర్వాహకురాలు రమా నందన పోలీసుల విచారణకు హాజరయ్యారు. లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, వీసాల రెన్యువల్ చేస్తామని చెప్పి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆమెను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విదేశాల నుంచి సోమవారం తిరిగి వచ్చిన రమా నందనను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
యూకే వీసాలు, ఉద్యోగాల పేరుతో కోట్ల మోసం
లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, యూకే వీసాల రెన్యువల్ చేయిస్తామని చెప్పి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేశారంటూ బాధితుడు క్రాంతికుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో రమా నందనతో పాటు ఆమె భర్త జాగర్లమూడి మధుకర్, అత్తామామలపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే దర్యాప్తు సంస్థలు వీరిపై లుక్ అవుట్ సర్క్యులర్ (LOC) జారీ చేశాయి.
ఈ-మెయిల్ సంప్రదింపులు.. 41A నోటీసులు జారీ
విచారణకు పూర్తిగా సహకరిస్తానని, కావున లుక్ అవుట్ నోటీసులు ఉపసంహరించుకోవాలని కోరుతూ 15 రోజుల క్రితమే రమా నందన విజయవాడ పోలీస్ కమిషనర్, డీసీపీలకు ఈ-మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు. అయితే లుక్ అవుట్ నోటీసు తొలగించడం సాధ్యం కాదని, స్వయంగా వచ్చి విచారణకు హాజరుకావాలని పోలీసులు స్పష్టం చేయడంతో ఆమె హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెకు 41A నోటీసులు అందించారు. రమా నందన విచారణ పూర్తయిన తర్వాత ఆమె భర్త మధుకర్ జాగర్లమూడి కూడా యూకే నుంచి ఇండియాకు వచ్చి పోలీసు విచారణకు హాజరుకానున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- భారత్-సౌదీ సంబంధాల బలోపేతంలో భారతీయ వ్యాపారుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బ్రిక్స్ సదస్సు వేళ ప్రధాని మోదీ–పుతిన్ భేటీ
- QNV 2030..హరిత పరివర్తనకు ఖతార్ చర్యలు..!!
- పోలీసు అధికారిపై దాడి.. నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష..!!
- స్కూల్స్ రీఓపెన్ కు ముందు 200 ట్రాఫిక్ పెట్రోల్స్ మోహరింపు..!!
- ఒమన్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం..!!
- జర్మన్ ఎంపీలతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- పోలీసుల విచారణకు హాజరైన యూట్యూబర్ రమా నందన
- అబుదాబిలో ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..!!
- ఉస్మానియా 85వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా







