శాంసంగ్ జే సిరీస్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు 10 జీబీ 4జీ డేటాను ఆఫర్ ..

- August 19, 2016 , by Maagulf
శాంసంగ్ జే సిరీస్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు 10 జీబీ 4జీ డేటాను ఆఫర్ ..

ఓ వైపు టెలికాం రంగంలో రసవత్తర పోరుకు సిద్ధమవుతున్న రిలయన్స్ జియో, శాంసంగ్ వంటి కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటుండగా.. మరోవైపు టెలికాం దిగ్గజాలు సైతం అదేబాటలో నడుస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ యూజర్లకు డేటాలపై బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. శాంసంగ్ జే సిరీస్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు 10 జీబీ 4జీ డేటాను ఆఫర్ గా అందించనున్నట్టు ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ వెల్లడించింది. ఈ ఆఫర్ ప్రస్తుత, కొత్త ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ యూజర్లందరూ సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపింది. 10 జీబీ 4జీ డేటాను కావాలనుకునే వారు రూ.250లతో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.ఎంపికచేసిన శాంసంగ్ గెలాక్సీ జే సిరీస్ స్మార్ట్ ఫోన్లకే ఈ ఆఫర్ వర్తిస్తుందట.కొత్త గెలాక్సీ జే సిరీస్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఈ ఆఫర్ ను యాక్టివేట్ చేసుకోవడానికి దగ్గర్లోని ఎయిర్ టెల్ రీటైల్ అవుట్ లెట్ ను లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆఫర్స్. ఎయిర్ టెల్.కామ్ పేజీని విజిట్ చేయగలరని ఎయిర్ టెల్ తెలిపింది. 4జీ కాని మార్కెట్లో ఎయిర్ టెల్ నిర్ధిష్ట వినియోగదారులూ 10 జీబీ 3జీ డేటా ఆఫర్ ను ఎంజయ్ చేయొచ్చని తెలిపింది. పగలంతా 1 జీబీ డేటా, రాత్రివేళ 9జీబీ 3జీ డేటా అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ప్రముఖ శాంసంగ్ జే సిరీస్ లతో తమ అసోసియేషన్ ను విస్తరించుకుంటామని, ఈ భాగస్వామ్యం ఎయిర్ టెల్ 4జీ నెట్ వర్క్ పై బెస్ట్-ఇన్-క్లాస్ స్మార్ట్ ఫోన్ అనుభూతిని కస్టమర్లు పొందడానికి దోహదం చేస్తుందని భారతీ ఎయిర్ టెల్ మార్కెట్ ఆపరేషన్స్ అజయ్ పురీ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com