భారత్–కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు
- September 09, 2026
కువైట్ సిటీ: భారత్, కువైట్ మధ్య 8వ విదేశాంగ కార్యాలయ సంప్రదింపులు కువైట్‌లో జరిగాయి. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలో గల్ఫ్ వ్యవహారాల అదనపు కార్యదర్శి అసీమ్ ఆర్. మహాజన్, కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖలో ఆసియా వ్యవహారాల సహాయ విదేశాంగ మంత్రి నవాఫ్ అబ్దుల్లతీఫ్ సులైమాన్ అల్-అహ్మద్ సహ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యంపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. భారత్–కువైట్ సంబంధాల్లో రాజకీయ సహకారం, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, సంస్కృతి తదితర అంశాలపై చర్చించారు.
అలాగే ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం, పరస్పర సహకారాన్ని విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరుపక్షాలు అభిప్రాయాలను పంచుకున్నాయి.
ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల పై చర్చ
ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా భారత్, కువైట్ ప్రతినిధులు అభిప్రాయాలను పంచుకున్నారు.
ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, వాణిజ్యం, ఇంధనం, పెట్టుబడులు, రక్షణ, భద్రత వంటి కీలక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఈ సంప్రదింపులు దోహదపడనున్నాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- భారత్–కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు
- ఖతార్లో వేతనాల చెల్లింపుపై కొత్త నిబంధనలు.. WPSలో కీలక మార్పులు
- సౌదీ అరేబియా రెడ్ సీ తీరానికి ఎతిహాద్ విమాన సర్వీసులు
- స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం..అభ్యర్థుల ఎంపిక పై చంద్రబాబు కీలక ఆదేశాలు
- భారతీయ సంస్థల్లో ఏఐ పెట్టుబడుల జోరు
- దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్గా షేక్ హమ్దాన్కు 20 ఏళ్లు..
- దుబాయ్ స్క్వేర్ మాల్లో ప్రపంచంలోనే తొలిసారి ఏసీ పార్కింగ్..
- పోలీసుల విచారణలో యూట్యూబర్ నందన..నాకేం తెలియదు
- ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్ వ్యవస్థాపకుడు వెంకటరత్నం పంతులు ఫోటో ఆవిష్కరణ
- దుబాయ్ లో ఘనంగా జరిగిన GWAC 10వ ఆవిర్భావ వేడుకలు...







