యూకేలో టెక్నికల్ ప్రాబ్లమ్.. ఖతార్ ఎయిర్వేస్ విమానాలకు అంతరాయం..!!
- September 09, 2026
దోహా:యునైటెడ్ కింగ్డమ్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఖతార్ ఎయిర్వేస్ విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు ప్రయాణికులకు ఎయిర్‌లైన్ ట్రావెల్ అలర్ట్ జారీ చేసింది.యూకేకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమానాలతో పాటు యూకే గగనతలం మీదుగా ప్రయాణించే సర్వీసులు కూడా ఆలస్యం అవుతున్నాయని ఖతార్ ఎయిర్వేస్ తెలిపింది. పరిస్థితులను బట్టి కొన్ని విమానాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించే అవకాశం ఉందని పేర్కొంది.
ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు ఖతార్ ఎయిర్వేస్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్‌లో తాజా విమాన సమాచారం, ఫ్లైట్ స్టేటస్‌ను తనిఖీ చేసుకోవాలని సూచించింది. అయితే ఈ అంతరాయం ఎప్పటివరకు కొనసాగుతుందనే విషయాన్ని ఎయిర్‌లైన్ వెల్లడించలేదు.
తాజా వార్తలు
- ఖతార్‌లో దోమల నివారణకు మార్గదర్శకాలు జారీ..!!
- అరబ్ రీడింగ్ ఛాలెంజ్..అక్టోబర్ 29న దుబాయ్‌లో తుది వేడుకలు..!!
- భారత్-కువైట్ దౌత్య సంబంధాలకు 65 ఏళ్లు.. మొక్కలు నాటిన భారతీయులు..!!
- తెలంగాణ టీజీ ఐపాస్ పై సైబర్ దాడి
- భద్రతా మండలిలో వీటో అధికారాలపై ఆంక్షలు విధించాలి..!!
- బహ్రెయిన్‌లో కొత్త ఆరోగ్య బీమా నిబంధనలు..!!
- ఒమన్‌లో కార్మికుల నివాసాలపై ఆంక్షలు..!!
- రక్షణ రంగంలో తెలంగాణను దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్
- సౌదీ అరేబియాలో క్షిపణుల అవశేషాలు..మక్కా, జెడ్డా, తాయిఫ్‌లో పడిన శకలాలు
- అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ







