మూడేళ్ల క్రితం తన అరెస్టును గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు
- September 10, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు తన అరెస్టుకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. “ప్రజల కోసం నిలబడితే ప్రజలు మన వెంట నిలబడతారు, నిజం కోసం నిలబడితే నిజమే మనల్ని నిలబెడుతుంది. ఇదే నా నమ్మకం” అంటూ ఆయన నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కేసు పేరుతో తనను అక్రమంగా అరెస్టు చేసి 53 రోజుల పాటు జైలులో నిర్బంధించిన ఘటన తనలో ఆత్మస్థైర్యాన్ని మరింత పెంచిందని తెలిపారు.
“నన్ను జైల్లో పెట్టగలరు కానీ, స్థైర్యాన్ని దెబ్బతీయలేరు”
గత పాలకుల కక్షసాధింపు చర్యలపై చంద్రబాబు స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి తప్పు చేయకపోయినా కుట్రపూరితంగా తనను జైలులో నిర్బంధించారని మండిపడ్డారు. “నన్ను జైల్లో పెట్టగలిగారు కానీ, నా మనోధైర్యాన్ని మాత్రం ఏమాత్రం దెబ్బతీయలేకపోయారు. వారి రాక్షస చర్యకు నేను కుంగిపోలేదు, ఎక్కడా లొంగిపోలేదు” అని స్పష్టం చేశారు. ఆ క్లిష్ట సమయంలో దేశవిదేశాల నుంచి ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు తన కోసం గొంతు ఎత్తారని, ఆనాడు వారు చూపిన సంఘీభావం తన జీవితంలో ఎప్పటికీ మరువలేనని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దిగ్విజయంగా చికాగో NATS క్రికెట్ టోర్నమెంట్
- మూడేళ్ల క్రితం తన అరెస్టును గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు
- యూఏఈలో కార్మిక చట్ట ఉల్లంఘనలు 15 శాతం తగ్గుదల
- బాలల నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ‘పాడనా తెలుగు పాట’
- జర్మనీ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్..
- గవర్నర్ ని కలిసిన BRS నేతలు
- బిగ్బాస్ హౌస్లోకి నందన....హోస్ట్ నాగార్జునకు వార్నింగ్!
- కొత్త ప్రభుత్వ సీజన్ పై షేక్ మహమ్మద్ సమీక్ష..
- యూఏఈకి తిరిగి వస్తున్న విజ్ ఎయిర్..
- తిరుమల బ్రహ్మోత్సవాలు ఖరారు.. సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి ఉత్సవాలు







