సౌదీ అరేబియాలో సెప్టెంబర్ 23న నేషనల్ డే సెలవు..!!
- September 10, 2026
రియాద్: సౌదీ అరేబియాలో 96వ జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రైవేట్, లాభాపేక్షలేని రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు సెప్టెంబర్ 23న అధికారిక సెలవు ప్రకటించారు.
సౌదీ మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ తన అధికారిక X ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. సెప్టెంబర్ 23న జాతీయ దినోత్సవ సెలవు ఉంటుందని తెలిపింది.
ఈ సెలవు ప్రైవేట్, నాన్‌ప్రాఫిట్ రంగాల్లోని ఉద్యోగులకు వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కార్మిక చట్టం అమలు నిబంధనల్లోని ఆర్టికల్ 24 ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అన్ని యాజమాన్యాలు ఆర్టికల్ 24లోని రెండో పేరాలో పేర్కొన్న విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
సెప్టెంబర్ 23నే నేషనల్ డే ఎందుకు?
సౌదీ అరేబియాలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1932లో దేశ వ్యవస్థాపకుడు కింగ్ అబ్దులజీజ్ వివిధ ప్రాంతాలను ఏకం చేసి ఆధునిక సౌదీ అరేబియా రాజ్యాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ రోజును జాతీయ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫోల్డబుల్ ఫోన్ రేసులోకి యాపిల్.. ‘ఐఫోన్ డ్యుయో’ ఆవిష్కరణ
- మధు యాష్కీకి కీలక బాధ్యతలు.. ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా నియామకం
- గల్ఫ్ కార్మికుల సమస్యల పై APNRT అధికారులతో చర్చ
- బ్రిటన్ నిర్ణయాన్ని స్వాగతించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఒమన్‌లో భారతీయ విద్యార్థుల కోసం ‘అవెనీర్ 2026’..!!
- బహ్రెయిన్‌లో ప్రతి 100 మందికి 150 మొబైల్ సబ్స్క్రిప్షన్లు..!!
- కువైట్‌లో పాఠశాలలకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో సెప్టెంబర్ 23న నేషనల్ డే సెలవు..!!
- దుబాయ్‌లో 999కు ఫోన్ చేస్తున్నారా?. పోలీసుల కీలక సూచన.!!
- దిగ్విజయంగా చికాగో NATS క్రికెట్ టోర్నమెంట్







