గల్ఫ్ కార్మికుల సమస్యల పై APNRT అధికారులతో చర్చ

- September 10, 2026 , by Maagulf
గల్ఫ్ కార్మికుల సమస్యల పై APNRT అధికారులతో చర్చ

మంగళగిరి: గల్ఫ్ దేశాల్లోని ఆంధ్రప్రదేశ్ ప్రవాస కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై APNRT సీఈఓ డా. కృష్ణమోహన్ తో చర్చించినట్లు తెలిపారు. మంగళగిరిలోని APNRT కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో గల్ఫ్ కార్మికుల సమస్యలు, వీసా, ఇమ్మిగ్రేషన్, ఉద్యోగ సంబంధిత అంశాలు తదితర విషయాలపై వివరంగా చర్చించారు.

గల్ఫ్‌లో తనకు ఉన్న అనుభవం ఆధారంగా పలు సమస్యల పరిష్కారానికి సంబంధించి సలహాలు, సూచనలు అందించగా, APNRT సీఈఓ డా. కృష్ణమోహన్ వాటిని సానుకూలంగా స్వీకరించి అభిప్రాయాలను తీసుకున్నారని తెలిపారు.

అనంతరం APNRT డైరెక్టర్ నాగేంద్రబాబు తో పాటు హెల్ప్‌లైన్ టీమ్ సభ్యులతో కూడా సమావేశమై ప్రవాసాంధ్రులకు అందుతున్న సేవలు, సమస్యల పరిష్కార విధానం, మరింత సమర్థవంతమైన సహాయ చర్యలపై చర్చించారు.

గల్ఫ్‌లోని ప్రతి ఆంధ్రప్రదేశ్ ప్రవాసుడికి అవసరమైన సమయంలో అండగా నిలిచి, సమస్యలు తలెత్తకముందే అవగాహన కల్పించే విధంగా APNRTతో కలిసి మరింత సమర్థవంతంగా పనిచేస్తామని APNRT గల్ఫ్ రీజినల్ కోఆర్డినేటర్ వాసు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com