బ్రిటన్ నిర్ణయాన్ని స్వాగతించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- September 10, 2026
దోహా: ఆక్రమిత పాలస్తీనా ప్రాంతంలోని అక్రమ ఇజ్రాయెల్ సెటిల్మెంట్ల నుంచి వస్తువుల దిగుమతులను నిషేధించాలని బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని 8 అరబ్, ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రులు స్వాగతించారు. ఖతార్, టర్కియే, ఈజిప్ట్, ఇండోనేషియా, జోర్డాన్, పాకిస్థాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ మంత్రులు సంయుక్తంగా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. అక్రమ సెటిల్మెంట్లకు సంబంధించిన సేవలపై ఆంక్షలు విధించాలన్న బ్రిటన్ నిర్ణయం కూడా అంతర్జాతీయ సమాజాన్ని ఇలాంటి చర్యలు తీసుకునేలా ప్రోత్సహిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, ఐస్లాండ్, ఐర్లాండ్, నార్వే, పోలాండ్, పోర్చుగల్, స్పెయిన్, స్వీడన్, బ్రిటన్ విదేశాంగ మంత్రులు విడుదల చేసిన ‘టూ-స్టేట్ సొల్యూషన్’పై ఉమ్మడి ప్రకటనను కూడా స్వాగతించారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం అక్రమమైన ఇజ్రాయెల్ సెటిల్మెంట్లతో వస్తువుల వాణిజ్యంపై జాతీయ స్థాయిలో ఆంక్షలు విధించడం లేదా యూరోపియన్ ఆంక్షలకు మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశాన్ని వారు స్వాగతించారు. అక్రమ ఇజ్రాయెల్ సెటిల్మెంట్లకు మద్దతు ఇచ్చే లేదా వాటిని కొనసాగించే కార్యకలాపాలను నిలిపివేసేందుకు అంతర్జాతీయ సమాజం మరిన్ని కఠినమైన, స్పష్టమైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
గాజాపై కీలక వ్యాఖ్యలు
గాజా ఆక్రమిత పాలస్తీనా ప్రాంతంలో అంతర్భాగమే అని 8 దేశాల విదేశాంగ మంత్రులు స్పష్టం చేశారు. గాజా ఘర్షణను ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సమగ్ర ప్రణాళికను పూర్తిగా, తక్షణమే అమలు చేయాలని కోరారు. దీంతో గాజాలో భద్రత, స్థిరత్వం నెలకొల్పడంతో పాటు మానవతా పరిస్థితిని మెరుగుపరచడం, పునర్నిర్మాణం, పునరుద్ధరణకు మార్గం సుగమం చేయడం, శాశ్వత శాంతికి పునాదులు వేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో కర్జకాన్ సముద్ర తీరానికి కొత్త రూపు..!!
- దోహా మెట్రో బస్సు రూట్లలో మార్పులు..!!
- పిల్లల్లో కిడ్నీ వ్యాధులు.. లక్షణాలు కనిపించేలోపే గుర్తించడం ముఖ్యం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ లు..!!
- కువైట్‌లో అమీరీ దివాన్ హార్స్ వేలం..!!
- యూఏఈలో బాలికను ఒంటరిగా వదిలేసిన మహిళ.. కోర్టు కీలక తీర్పు..!!
- యూఏఈలో ఈ-ఇన్వాయిసింగ్ అమలుకు గడువు.. నెలకు Dh5,000 జరిమానా!
- బెర్న్‌లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు
- ఖతార్‌లో దోమల నివారణకు మార్గదర్శకాలు జారీ..!!
- అరబ్ రీడింగ్ ఛాలెంజ్..అక్టోబర్ 29న దుబాయ్‌లో తుది వేడుకలు..!!







