బహ్రెయిన్‌లో ప్రతి 100 మందికి 150 మొబైల్ సబ్‌స్క్రిప్షన్లు..!!
- September 10, 2026
మనామా: బహ్రెయిన్‌లో మొబైల్ వినియోగం భారీగా ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. గత ఏడాది రెండో త్రైమాసికం నాటికి ప్రతి 100 మందికి 150 మొబైల్ సబ్‌స్క్రిప్షన్లు నమోదయ్యాయి. టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA) ఆడిటెడ్ ఖాతాల ప్రకారం.. మొబైల్ సబ్‌స్క్రిప్షన్ల సంఖ్య 2.387 మిలియన్లకు చేరింది. 2024 చివరితో పోలిస్తే ఇది 2 శాతం పెరుగుదల నమోదైంది. బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రిప్షన్లు 2.595 మిలియన్లకు చేరాయి. అంటే ప్రతి 100 మందికి 163 బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రిప్షన్లు ఉన్నట్లు లెక్క.
టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ గత ఏడాది BD15.402 మిలియన్ల మిగులు నమోదు చేసింది. 2024లో నమోదైన BD15.946 మిలియన్లతో పోలిస్తే ఇది 3.4 శాతం తగ్గింది. అథారిటీ సుమారు BD15.95 మిలియన్లను ఆర్థిక, జాతీయ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖకు బదిలీ చేసింది. అయితే నిర్వహణ ఆదాయం పెద్దగా మారలేదు. ఇది BD21.156 మిలియన్లుగా నమోదైంది. అదే సమయంలో ఖర్చులు 7.5 శాతం పెరిగి BD7.125 మిలియన్లకు చేరాయి. దీంతో నిర్వహణ మిగులు BD14.031 మిలియన్లకు తగ్గింది.
లైసెన్స్ ఫీజులే ప్రధాన ఆదాయం
టెలికాం వార్షిక లైసెన్స్ ఫీజులు అథారిటీకి ప్రధాన ఆదాయ వనరుగా కొనసాగాయి. వీటి ద్వారా BD8.433 మిలియన్లు వచ్చాయి. ఇది మొత్తం నిర్వహణ ఆదాయంలో 39.9 శాతంగా ఉంది. స్పెక్ట్రమ్ అందుబాటు ఫీజుల ద్వారా BD5.289 మిలియన్లు ఆదాయం వచ్చింది. ఫ్రీక్వెన్సీ, స్పెక్ట్రమ్ బ్యాండ్ ఛార్జీల ఆదాయం 7.5 శాతం తగ్గి BD3.541 మిలియన్లకు చేరింది. ఈ మూడు ఆదాయ వనరులు కలిపి అథారిటీ మొత్తం నిర్వహణ ఆదాయంలో 81.6 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
ఉద్యోగుల ఖర్చులే ఎక్కువ
అథారిటీ ఖర్చుల్లో ఉద్యోగుల వ్యయాలే అత్యధికంగా ఉన్నాయి. వీటికి BD4.023 మిలియన్లు ఖర్చయ్యాయి. కన్సల్టెన్సీ, న్యాయ సేవల ఖర్చులు 25.5 శాతం పెరిగి BD738,000కు చేరాయి. అలాగే వసూలు కాకపోయే బకాయిల కోసం BD568,000 కేటాయించారు. 2024లో ఇలాంటి కేటాయింపు ఏదీ లేదు.
బహ్రెయిన్‌లో ఫైబర్ సబ్‌స్క్రిప్షన్లు సుమారు 182,000గా ఉన్నాయి. ఇవి మొత్తం కుటుంబాల్లో 63 శాతానికి సమానం. ఫైబర్ వినియోగదారుల్లో 86 శాతం మంది కనీసం 100 Mbps వేగం కలిగిన ప్యాకేజీలను ఉపయోగిస్తున్నారు. 2024లో బ్రాడ్‌బ్యాండ్ డేటా వినియోగం 1.971 బిలియన్ గిగాబైట్లకు చేరింది. ఫిక్స్‌డ్ నెట్‌వర్క్ డేటా వినియోగం 7 శాతం, మొబైల్ డేటా వినియోగం 15 శాతం పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఫోల్డబుల్ ఫోన్ రేసులోకి యాపిల్.. ‘ఐఫోన్ డ్యుయో’ ఆవిష్కరణ
- మధు యాష్కీకి కీలక బాధ్యతలు.. ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా నియామకం
- గల్ఫ్ కార్మికుల సమస్యల పై APNRT అధికారులతో చర్చ
- బ్రిటన్ నిర్ణయాన్ని స్వాగతించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఒమన్‌లో భారతీయ విద్యార్థుల కోసం ‘అవెనీర్ 2026’..!!
- బహ్రెయిన్‌లో ప్రతి 100 మందికి 150 మొబైల్ సబ్‌స్క్రిప్షన్లు..!!
- కువైట్‌లో పాఠశాలలకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో సెప్టెంబర్ 23న నేషనల్ డే సెలవు..!!
- దుబాయ్‌లో 999కు ఫోన్ చేస్తున్నారా?. పోలీసుల కీలక సూచన.!!
- దిగ్విజయంగా చికాగో NATS క్రికెట్ టోర్నమెంట్







