విధులకు హాజరుకావాలని కశ్మీర్ సర్కార్ హుకుం..
- August 20, 2016
కశ్మీర్లో కర్ఫ్యూ శనివారంతో 42వ రోజుకు చేరడంతో జనజీవనం స్తంభించింది. బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ అనంతరం తలెత్తిన అల్లర్లు కొనసాగుతుండటం, ఉద్రిక్త పరిస్థితులు సడలకపోవడంతో అనంతనాగ్ పట్టణం, శ్రీనగర్ సిటీలోని పలు ప్రాంతంలో కర్ఫ్యూ కొనసాగుతోందని, కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉన్నాయని పోలీసులు తెలిపారు. మరోవైపు, విధులకు హాజరుకావాలని, లేదంటే ఆగస్టు నెల జీతంలో వేతనంలో కోత విధిస్తామని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాలు సముచితంగా లేవని, నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని వారంటున్నారు.మరోవైపు, శ్రీనగర్ ఓల్డ్ సిటీలోని నౌహట్టా ఏరియాలో ఉన్న జామా మసీదులో వరుసగా ఆరో రోజు కూడా ప్రార్థనలు జరగలేదు. సీఆర్పీఎఫ్ దళాల ఫైరింగ్‌లో మృతిచెందిన నలుగురు పౌరులకు నివాళులర్పించడానికి బుద్గావ్ జిల్లాలోని ఆరిపంతన్ గ్రామం వరకూ మార్చ్ జరిపాలని నిర్ణయించుకున్న వేర్పాటువాద నేతలు సైయద్ అలీ గిలానీ, మిర్వైజ్ ఉమర్ ఫరూక్‌లను ముందస్తుగా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







