400 మిలియన్ డాలర్లు చెల్లించనున్న అమెరికా ..
- August 20, 2016
ఇరాన్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న నలుగురు అమెరికన్ ఖైదీల విడుదలకు రంగం సిద్ధం చేసినట్టు అమెరికా కార్యదర్శి జాన్ కిర్బీ వెల్లడిం చారు. అయితే, ఆ ఖైదీల విడుదల కోసం తాము 400 మిలియన్ డాలర్ల ( రూ. 2,685 కోట్లు) మొత్తాన్ని ఇరాన్‌కు చెల్లించాల్సి ఉంటోందని చెప్పారు. అమెరికా జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు ఇరాన్ ఖైదీలను విడుదల చేసినట్టయితే, తమ జైళ్లలో ఉన్న నలుగురు ఖైదీలను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ పేర్కొంది. ఈ మేరకు జనవరి17న ఇరుదేశాల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. అంతేగాకుండా, గతేడాది జూలైలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య అణు ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే.ఈ మేరకు ఖైదీల విడుదల విషయంలో ఇరుదేశాలు ఓ అవగాహనకు వచ్చినట్టు సమాచారం. కాగా, జైళ్లలో ఉన్న నలుగురు అమెరికన్ ఖైదీలు టెహ్రాన్ నుంచి అమెరికాకు చేరినప్పుడే పూర్తి చెల్లింపు చేస్తామని అమెరికా షరతు పెట్టడం గమనార్హం.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!







