తెలంగాణలో కొత్త జిల్లాల ప్రక్రియ చివరి దశకు..
- August 20, 2016
తెలంగాణలో కొత్త జిల్లాల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈరోజు జరిగే అఖిలపక్ష సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై అభిప్రాయాలు సేకరించనున్నారు. దసరా నుంచి ఎలాగైనా కొత్త జిల్లాలను ఆచరణలోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. దీని కోసం ఓ వైపు కార్యాచరణ రూపొందిస్తూనే అభిప్రాయ సేకరణ చేపడుతోంది. ప్రభుత్వం నియమించిన సబ్‌కమిటీ కొత్త జిల్లాలపై నివేదికను సీఎంకు సమర్పించింది. కొత్తగా 27 జిల్లాలను, 58 రెవెన్యూ డివిజన్లను 533 మండలాలను ప్రతిపాదించింది ఉపసంఘం. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలోని సి బ్లాక్‌లో ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ కూడా దీనికి హాజరవుతారు.మంత్రివర్గ ఉపసంఘం నివేదికను అఖిలపక్ష సమావేశం ముందు ఉంచనున్నారు. దీనిపై అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటారు. కొత్త జిల్లాల ఏర్పాటులో పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రతిపాదనల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటును అన్ని పార్టీలు స్వాగతిస్తున్నాయి.కాకపోతే రాజకీయ ప్రయోజనాల కోసం చేసే జిల్లాలను వ్యతిరేకించాలని భావిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీసేలా జిల్లాల విభజన సరికాదంటున్నాయి. అఖిలపక్ష సమావేశానికి ముందే సబ్ కమిటీ ప్రతిపాదనలను తమకు ఇవ్వాలని కోరుతున్నాయి. నివేదిక ఇస్తే ప్రభుత్వం ప్రతిపాదనలపై అధ్యయనం చేసి అభిప్రాయాలు చెప్పడానికి వీలవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీఎస్ రాజీవ్‌శర్మకు లేఖ రాశారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







