పవన్‌ కల్యాణ్‌తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ...

- August 20, 2016 , by Maagulf
పవన్‌ కల్యాణ్‌తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ...

జనసేనపార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ అయ్యారు. హైదరాబాద్‌ వచ్చిన కుమారస్వామి పవన్‌ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వపన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ...'మా ఇద్దరికి చాలాకాలంగా అనుబంధం ఉంది. కుమారస్వామితో సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై మరో సందర్భంలో మాట్లాడతా' అని తెలిపారు. ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని కుమారస్వామి కూడా చెప్పారు. తన కుమారుడు నిఖిల్‌ సినీరంగ ప్రవేశం చేస్తున్నారని, పవన్‌ కల్యాణ్‌ ఆశీస్సుల కోసం వచ్చినట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com