కూరగాయల మార్కెట్‌లో మద్యం బాటిళ్లు స్వాధీనం..!!

- September 11, 2026 , by Maagulf
కూరగాయల మార్కెట్‌లో మద్యం బాటిళ్లు స్వాధీనం..!!

కువైట్ : సలీబియా కూరగాయల మార్కెట్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో కస్టమ్స్ అధికారులు ఓ ట్రక్కులో భారీగా మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కూరగాయల మార్కెట్‌ తనిఖీ ప్రాంతంలో సాధారణ తనిఖీల్లో భాగంగా ట్రక్కును పరిశీలించగా 11 మద్యం బాటిళ్లతో పాటు ఒక బీర్ బాటిల్ బయటపడినట్లు కువైట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ వెల్లడించింది. కస్టమ్స్ అధికారులు విధుల్లో చూపిన అప్రమత్తత, నిఘా, సమర్థత కారణంగానే ఈ స్వాధీనం సాధ్యమైందని అధికారులు తెలిపారు.

మద్యం బాటిళ్లు గుర్తించిన వెంటనే కస్టమ్స్ ఇన్వెస్టిగేషన్ అండ్ సెర్చ్ విభాగానికి సమాచారం అందించారు. అనంతరం అవసరమైన చట్టపరమైన చర్యల కోసం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ డ్రగ్ కంట్రోల్‌తో సమన్వయం చేసినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లకు సంబంధించి తదుపరి చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతోందని ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com