హెచ్-1బీ వీసాదారులకు భారీ షాక్

- September 11, 2026 , by Maagulf
హెచ్-1బీ వీసాదారులకు భారీ షాక్

 అమెరికా: అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వేలాది మంది విదేశీ నిపుణులు, ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగులకు ట్రంప్ పరిపాలన విభాగం (DHS) మరో బిగ్ షాక్ ఇచ్చింది. ఉద్యోగం కోల్పోయిన తర్వాత కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా అమెరికాలో మరికొంత కాలం ఉండేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను పూర్తిగా రద్దు చేసేలా కొత్త రూల్‌ను ప్రతిపాదించింది. ‘ఎలిమినేటింగ్‌ ద డిస్క్రీషనరీ 60-డే గ్రేస్‌ పీరియడ్‌’ (Eliminating the Discretionary 60-Day Grace Period) అనే పేరుతో ఈ ముసాయిదా నిబంధనను డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (DHS) రూపొందించింది.

కొత్త నిబంధనల వెనుక ఉన్న పర్యవసానాలు

  • కొత్త నిబంధన ఆమోదం పొంది అమల్లోకి వస్తే, ఉద్యోగం కోల్పోయిన నాన్-ఇమ్మిగ్రెంట్ ఉద్యోగికి అమెరికాలో కొనసాగేందుకు ఇతర చట్టబద్ధమైన వీసా/అనుమతి లేకపోతే, వెంటనే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది.
  • ఉద్యోగం ముగిసిన వెంటనే నోటీసెస్ టు అపియర్ (Notice to Appear – NTA) జారీ చేసే అవకాశాలు పెరుగుతాయి. ఇది విదేశీయులను దేశం నుంచి పంపించివేసే (Deportation) ప్రక్రియకు మొదటి అడుగుగా మారుతుంది.
  • కేవలం H-1B మాత్రమే కాకుండా, E-1, E-2, E-3, H-1B1, L-1, O-1, TN వీసాదారులు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు (Dependents) కూడా ఈ రద్దు వర్తిస్తుంది.

US Rules on H1B Visa : ఒబామా హయాంలో వచ్చిన సదుపాయం

2016లో ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉద్యోగుల సౌకర్యార్థం మరియు ఉద్యోగాలు సులభంగా మారడానికి (Job Portability) ఈ 60 రోజుల గ్రేస్ పీరియడ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల లేఆఫ్స్ ఎదుర్కొన్న టెక్ నిపుణులు సురక్షితంగా మరో కంపెనీలో స్పాన్సర్‌షిప్ పొందడానికి తగినంత సమయం లభించేది. డీహెచ్‌ఎస్ (DHS) గణాంకాలు & రుసుముల బాదుడుహెచ్-1బీ వీసాదారుల్లో దాదాపు 70% కంటే ఎక్కువ మంది భారతీయులే ఉండటం వల్ల ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. 2021 నుండి 2025 మధ్య కాలంలో ఉద్యోగం మారిన లేదా కోల్పోయిన 3.28 లక్షల మంది ప్రాథమిక లబ్ధిదారుల్లో కేవలం 5.77% మందికి మాత్రమే గ్రేస్ పీరియడ్‌లో కొత్త పిటిషన్లు దాఖలయ్యాయని డీహెచ్‌ఎస్ గణాంకాలు చూపుతున్నాయి.ఈ గ్రేస్ పీరియడ్ రద్దు ప్రతిపాదనకు తోడు, H-1B క్యాప్-సబ్జెక్ట్ పిటిషన్‌లపై అదనంగా $1,03,265 (సుమారు ₹86 లక్షలకు పైగా) రుసుమును విధించాలని DHS ఇప్పటికే ప్రతిపాదించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com