కూరగాయల మార్కెట్లో మద్యం బాటిళ్లు స్వాధీనం..!!
- September 11, 2026
కువైట్ : సలీబియా కూరగాయల మార్కెట్లో తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో కస్టమ్స్ అధికారులు ఓ ట్రక్కులో భారీగా మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కూరగాయల మార్కెట్ తనిఖీ ప్రాంతంలో సాధారణ తనిఖీల్లో భాగంగా ట్రక్కును పరిశీలించగా 11 మద్యం బాటిళ్లతో పాటు ఒక బీర్ బాటిల్ బయటపడినట్లు కువైట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ వెల్లడించింది. కస్టమ్స్ అధికారులు విధుల్లో చూపిన అప్రమత్తత, నిఘా, సమర్థత కారణంగానే ఈ స్వాధీనం సాధ్యమైందని అధికారులు తెలిపారు.
మద్యం బాటిళ్లు గుర్తించిన వెంటనే కస్టమ్స్ ఇన్వెస్టిగేషన్ అండ్ సెర్చ్ విభాగానికి సమాచారం అందించారు. అనంతరం అవసరమైన చట్టపరమైన చర్యల కోసం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ డ్రగ్ కంట్రోల్‌తో సమన్వయం చేసినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లకు సంబంధించి తదుపరి చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతోందని ప్రకటించారు.
తాజా వార్తలు
- మహిళల ఆసియా కప్ ఫైనల్‌కు ముందు ట్రోఫీతో భారత్, శ్రీలంక కెప్టెన్లు
- బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడితో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ భేటీ
- ఖతార్: నిఖత్ జరీన్‌కు భారత రాయబారి డా.శ్రీకర్ రెడ్డి చేతుల మీదుగా ఘన సత్కారం
- వాణిజ్యం నుంచి లాజిస్టిక్స్ కారిడార్ల వరకు..విస్తరిస్తున్న భారత్-యూఏఈ ఆర్థిక భాగస్వామ్యం
- కువైట్ లైబ్రరీ ప్రాజెక్టులపై సమీక్ష.. ఆక్స్ఫర్డ్ తో చర్చలు..!!
- సౌదీపై దాడుల ఎఫెక్ట్.. ఇరాక్‌లో మైసాన్ ఆపరేషన్స్ కమాండర్ తొలగింపు..!!
- 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక!
- ఏ దేశానికి BRICS కూటమి వ్యతిరేకం కాదు: ప్రధాని మోదీ
- ఇక విదేశాల్లోనే ఫుడ్ హ్యాండ్లర్ పరీక్ష.. ఖతార్ కీలక నిర్ణయం..!!
- ఒమన్‌లో అక్రమ ప్రవేశాల వైరల్ వీడియోపై ROP క్లారిటీ..!!







