మక్కాలో ఐదుగురు పాకిస్థానీలు అరెస్ట్..!!
- September 11, 2026
మక్కా: పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమంగా మట్టి, అవక్షేపాలను (Sediment) తవ్విన ఐదుగురు పాకిస్థాన్ పౌరులను సౌదీ అరేబియాలోని స్పెషల్ ఫోర్సెస్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ సెక్యూరిటీ (SFES) అరెస్ట్ చేసింది.
మక్కా ప్రాంతంలో పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా అవక్షేపాలను వెలికితీస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఐదుగురు పాకిస్థాన్ నివాసితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై అమల్లో ఉన్న చట్టాల ప్రకారం చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. అక్రమ తవ్వకాలు, మట్టి తరలింపునకు ఉపయోగించిన 5 పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పర్యావరణానికి లేదా వన్యప్రాణులకు హాని కలిగించే కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, వాటికి పాల్పడే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటున్నామని SFES వెల్లడించింది.
ఇలాంటి పర్యావరణ ఉల్లంఘనలు కనిపిస్తే ప్రజలు అధికారులకు సమాచారం ఇవ్వాలని SFES సూచించింది. మక్కా, మదీనా, రియాద్, తూర్పు ప్రావిన్స్ 911, సౌదీలోని ఇతర ప్రాంతాలు 999, 996 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలి. ప్రజలు అందించే సమాచారాన్ని పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, సమాచారం అందించిన వారికి ఎలాంటి బాధ్యత ఉండదని SFES స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీగా కల్తీ, నాణ్యత లేని ఆహారం ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో విద్వేష ప్రసంగాలకు కఠిన శిక్షలు..!!
- పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శివప్రతాప్
- వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్!
- మక్కాలో ఐదుగురు పాకిస్థానీలు అరెస్ట్..!!
- బర్కా, యాంకుల్కు WHO ‘హెల్తీ సిటీ’ గుర్తింపు..!!
- 2030 విజన్ కోసం ఖతార్ కీలక అడుగు..!!
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదాలు–15 మంది మృతి!
- పాస్‌పోర్ట్ అవసరం లేదు.. లగేజ్ ట్యాగ్ కూడా ఉండదు..!!
- షార్జా ఎక్స్పో సెంటర్లో మమ్ముట్టి ‘రాజకీయమ్’ షో..







