వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్!

- September 11, 2026 , by Maagulf
వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్!

న్యూ ఢిల్లీ: రానున్న పండుగల సీజన్‌ వేళ రైలు టికెట్లకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఈ క్రమంలో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్‌లో చారిత్రాత్మక రికార్డు సృష్టించగా, మరోవైపు సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వేళల్లో దక్షిణ మధ్య రైల్వే మార్పులు చేసింది.

ఐఆర్‌సీటీసీ చరిత్రలోనే సరికొత్త ఆల్ టైమ్ రికార్డు
సెప్టెంబర్ 7న ఐఆర్‌సీటీసీ హిస్టరీలోనే అత్యధికంగా ఒకేరోజు 20,06,353 టికెట్లు బుక్ అయ్యాయి. మరుసటి రోజు (సెప్టెంబర్ 8న) కూడా 19,50,699 టికెట్లు బుక్ కావడం విశేషం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రిజర్వ్‌డ్ టికెట్లలో ఏకంగా 89% టికెట్లు ఆన్‌లైన్ ద్వారానే జరుగుతున్నాయని సంస్థ తెలిపింది. పెరిగిన ట్రాఫిక్‌ను తట్టుకునేలా జూలై 15, 2026న సరికొత్త వెబ్‌సైట్, యూజర్ ఇంటర్‌ఫేస్ మరియు కొత్త సర్వర్లను అందుబాటులోకి తెచ్చారు. ఫేక్ బుకింగ్స్, బాట్స్ వాడకంపై ఉక్కుపాదం మోపుతూ 3.04 కోట్ల యూజర్ ఐడీలను డియాక్టివేట్ చేశారు. తత్ఫలితంగా బాట్ ట్రాఫిక్ 55-65% వరకు తగ్గింది. ఉదయం 8:00 నుండి 8:10 వరకు ఏజెంట్లకు బుకింగ్స్ నిలిపివేయడంతో పాటు ఆధార్ వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేశారు.

సికింద్రాబాద్ – విశాఖ వందే భారత్ రీషెడ్యూల్
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక సమాచారం అందించింది.

రైలు నంబర్: 20834 (సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్)
మార్చిన సమయం: శుక్రవారం (సెప్టెంబర్ 11, 2026) సాధారణ సమయం మధ్యాహ్నం 03:00 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు, పెయిరింగ్ ట్రైన్ ఆలస్యం కావడం వల్ల సాయంత్రం 06:00 గంటలకు (6:00 PM) బయలుదేరుతుంది.
3 గంటలు ఆలస్యం: ప్రయాణికులు ఈ 3 గంటల ఆలస్యాన్ని గమనించి తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com