కువైట్‌లో భారీగా కల్తీ, నాణ్యత లేని ఆహారం ధ్వంసం..!!
- September 11, 2026
కువైట్ : ప్రజారోగ్యానికి హాని కలిగించే, కల్తీ చేసిన ఆహార పదార్థాలపై కువైట్ అధికారులు కొరడా ఝళిపించారు. క్యాపిటల్, ఫర్వానియా గవర్నరేట్లలో పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ (PAFN) నిర్వహించిన తనిఖీల్లో భారీగా నాణ్యత లేని, కల్తీ ఆహార పదార్థాలను గుర్తించారు. క్యాపిటల్ గవర్నరేట్ ఇన్స్పెక్షన్ విభాగం తనిఖీల్లో మానవ వినియోగానికి అనర్హమైన ఆహారం, పాడైపోయిన ఉత్పత్తులు గుర్తించారు. వాటి సహజ లక్షణాలైన రంగు, ఆకారం, వాసన మారిపోయినట్లు అధికారులు తెలిపారు. అలాగే కల్తీ చేసిన ఆహార పదార్థాలు, సరైన లేబుల్స్ లేని ఉత్పత్తులు, ఆహార సంస్థల్లో సాధారణ ఆరోగ్య, పరిశుభ్రత నిబంధనల ఉల్లంఘనలను కూడా అధికారులు గుర్తించారు.
108,040 కిలోల ఆహారం ధ్వంసం
తనిఖీల్లో మొత్తం 108,040 కిలోల నాణ్యత లేని, కల్తీ ఆహార పదార్థాలను అధికారులు ధ్వంసం చేశారు. మరోవైపు ఫర్వానియా గవర్నరేట్‌లో నిర్వహించిన తనిఖీల్లో ఆరోగ్య లైసెన్స్ లేకుండా ఆహార ఉత్పత్తులను విక్రయిస్తూ, సరైన ఆరోగ్య ధ్రువపత్రాలు లేకుండా ఆహార వ్యాపారం చేస్తున్న ఓ సంస్థపై అధికారులు ఉల్లంఘన నివేదిక నమోదు చేశారు.
వినియోగదారుల భద్రతే లక్ష్యం
ఆహార సంస్థలు నిర్దేశిత ఆరోగ్య ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా చూడటం, మార్కెట్లోకి వచ్చే ఆహార ఉత్పత్తుల భద్రతను నిర్ధారించడం, వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతున్నాయని PAFN వెల్లడించింది.
తాజా వార్తలు
- పుతిన్‌కు ప్రధాని మోదీ అరుదైన కానుక!
- ట్రాన్స్జెండర్లకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్
- కువైట్‌లో భారీగా కల్తీ, నాణ్యత లేని ఆహారం ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో విద్వేష ప్రసంగాలకు కఠిన శిక్షలు..!!
- పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శివప్రతాప్
- వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్!
- మక్కాలో ఐదుగురు పాకిస్థానీలు అరెస్ట్..!!
- బర్కా, యాంకుల్కు WHO ‘హెల్తీ సిటీ’ గుర్తింపు..!!
- 2030 విజన్ కోసం ఖతార్ కీలక అడుగు..!!
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదాలు–15 మంది మృతి!







