విదేశీ పెట్టుబడిదారులు, కుటుంబాలకు 5 ఏళ్ళ రెసిడెన్సీ!

- August 20, 2016 , by Maagulf
విదేశీ పెట్టుబడిదారులు, కుటుంబాలకు 5 ఏళ్ళ రెసిడెన్సీ!

విదేశీ పెట్టుబడిదారులు, వారి కుటుంబాలకు ఐదేళ్ళపాటు బహ్రెయిన్‌లో నివాసం ఉండేందుకు వీలుగా నిబంధనల్ని సవరించాల్సిందిగా ఎంపీ మొహమ్మద్‌ అల్‌ మారిఫి, ఓ ప్రోజల్‌ని ప్రస్తుత లెజిస్లేటివ్‌ టీమ్‌ ముందుంచే ప్రయత్నం చేయనున్నారు. పెట్టుబడిదారుల్ని ప్రోత్సహించడం ద్వారా బహ్రెయిన్‌ ఆర్థిక వ్యవస్థకూ ఊతమిచ్చినట్లవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రపోజల్‌కి ఆమోదం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం ఆయిల్‌ ఉత్పత్తులపైనే ఆధారపడి ఉన్న బహ్రెయిన్‌, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించగలిగితే, తద్వారా దేశంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని చెబుతున్నారాయన. తాను చేసిన ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే, స్టాక్‌ మార్కెట్లలో ర్యాలీ ప్రారంభమవుతుందని చెప్పారు. బహ్రెయిన్‌ మార్కెట్స్‌ పుంజుకోవడం దేశ ఆర్థిక ప్రగతికి ఊతమివ్వడం ఖాయమని చెప్పారు ఎంపీ అల్‌ మరాఫి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com