‘ఆదర్శ కుటుంబం’ టీజర్ డేట్, టైమ్ ఫిక్స్!

- September 11, 2026 , by Maagulf
‘ఆదర్శ కుటుంబం’ టీజర్ డేట్, టైమ్ ఫిక్స్!

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం’ (హౌస్ నంబర్: 47). ప్రేక్షకులు మరియు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక క్రేజీ అప్‌డేట్ అందించారు. ఈ చిత్ర అధికారిక టీజర్‌ను రేపు (శనివారం) మధ్యాహ్నం 12 గంటలకు సోషల్ మీడియా వేదికగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

క్రేజీ స్టార్ కాస్ట్, సాంకేతిక నిపుణులు
పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ తారాగణం భాగమవుతోంది. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా.. నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేశ్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. భారీ కాస్టింగ్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com