ఒమన్‌లో దారుణం.. తల్లిపై కత్తితో దాడి..!!

- September 12, 2026 , by Maagulf
ఒమన్‌లో దారుణం.. తల్లిపై కత్తితో దాడి..!!

మస్కట్: ఒమన్‌లోని అల్ ఖౌద్ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆసియా దేశానికి చెందిన ఓ ప్రవాస మహిళ తన తల్లిపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తల్లి మృతి చెందింది. ఘటన అనంతరం నిందితురాలు కూడా *ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. దాడికి దారితీసిన కారణాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అవసరమైన చట్టపరమైన చర్యలను పూర్తి చేస్తున్నట్లు ఒమన్ పోలీసులు తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com