ఒమన్‌లో దారుణం.. తల్లిపై కత్తితో దాడి..!!
- September 12, 2026
మస్కట్: ఒమన్‌లోని అల్ ఖౌద్ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆసియా దేశానికి చెందిన ఓ ప్రవాస మహిళ తన తల్లిపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తల్లి మృతి చెందింది. ఘటన అనంతరం నిందితురాలు కూడా *ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. దాడికి దారితీసిన కారణాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అవసరమైన చట్టపరమైన చర్యలను పూర్తి చేస్తున్నట్లు ఒమన్ పోలీసులు తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్ లో బోటు ప్రమాదం..76కు చేరిన మరణాలు
- న్యూఢిల్లీలో పుతిన్‌తో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ భేటీ
- BRICS సమ్మిట్..నేటి షెడ్యూల్ ఇదే
- తెలంగాణ అసెంబ్లీ సెషన్: ప్రజా విశ్వాసం బిల్లు-2026 ఆమోదం
- తమిళ సినీ అభిమానులకు సర్ప్రైజ్.. సిల్వర్‌స్టోన్‌లో విజయ్, అజిత్ కుమార్ కలయిక
- SIIMA 2026 తెలుగు,కన్నడ విజేతలు వీరే..
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- యూఏఈ లాటరీలో Dh100,000 బహుమతి గెలిచిన వ్యక్తి..!!
- బహ్రెయిన్‌లో BD14,000 విలువైన చోరీలు.. ఐదుగురు అరెస్ట్..!!
- సౌదీలో భారీగా అక్రమ నివాసితుల అరెస్టులు..!!







