కువైట్ తీరాలకు తరలివస్తున్న ఫ్లెమింగోలు..!!
- September 12, 2026
కువైట్: కువైట్ తీర ప్రాంతాలు అరుదైన అందంతో సందడి చేస్తున్నాయి. వింటర్ ప్రారంభానికి ముందే పెద్ద సంఖ్యలో ఫ్లెమింగోలు కువైట్ తీరాలకు చేరుకోవడం ప్రారంభించాయి. ముఖ్యంగా కువైట్ బేలోని లోతు తక్కువగా ఉన్న నీటి ప్రాంతాల్లో గుంపులుగా కనిపిస్తున్న ఈ గులాబీ రంగు పక్షులు పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి.
కువైట్‌కు వింటర్ లో వలస వచ్చే ప్రముఖ పక్షుల్లో గ్రేటర్ ఫ్లెమింగో ఒకటి. సాధారణంగా ఆగస్టు నుంచే ఇవి కువైట్‌కు చేరుకుంటాయి. కువైట్ బే, జహ్రా రిజర్వ్, సులైబిఖాత్ బీచ్ తదితర ప్రాంతాల్లో వీటిని పెద్ద సంఖ్యలో చూడవచ్చు. వింటర్ తీవ్రత పెరిగే కొద్దీ ఫ్లెమింగోల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది.
మార్చి, ఏప్రిల్‌లో తిరుగు ప్రయాణం
కువైట్‌లో కొంతకాలం గడిపిన అనంతరం ఫ్లెమింగోలు సాధారణంగా మార్చి చివరి నుంచి ఏప్రిల్ వరకు తమ సంతానోత్పత్తి ప్రాంతాల వైపు తిరుగు ప్రయాణం ప్రారంభిస్తాయి. ఫ్లెమింగోలు కేవలం ప్రకృతి అందానికే పరిమితం కాకుండా కువైట్ తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. లోతు తక్కువగా ఉన్న నీటిలో, బురద నేలల్లో లభించే ఆల్గీ, సూక్ష్మజీవులు, చిన్న జలచరాలను ఇవి ఆహారంగా తీసుకుంటాయి.
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్ లో బోటు ప్రమాదం..76కు చేరిన మరణాలు
- న్యూఢిల్లీలో పుతిన్‌తో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ భేటీ
- BRICS సమ్మిట్..నేటి షెడ్యూల్ ఇదే
- తెలంగాణ అసెంబ్లీ సెషన్: ప్రజా విశ్వాసం బిల్లు-2026 ఆమోదం
- తమిళ సినీ అభిమానులకు సర్ప్రైజ్.. సిల్వర్‌స్టోన్‌లో విజయ్, అజిత్ కుమార్ కలయిక
- SIIMA 2026 తెలుగు,కన్నడ విజేతలు వీరే..
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- యూఏఈ లాటరీలో Dh100,000 బహుమతి గెలిచిన వ్యక్తి..!!
- బహ్రెయిన్‌లో BD14,000 విలువైన చోరీలు.. ఐదుగురు అరెస్ట్..!!
- సౌదీలో భారీగా అక్రమ నివాసితుల అరెస్టులు..!!







