1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక!
- September 12, 2026
హైదరాబాద్: సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ‘1980s / Retro Photo Trend’ పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలను హెచ్చరించారు. ట్రెండ్ పేరుతో వ్యక్తిగత ఫోటోలను ప్లాట్‌ఫామ్‌లలో పంచుకోవద్దని స్పష్టం చేశారు. వింతైన అప్లికేషన్లు లేదా తెలియని వెబ్‌సైట్లలో వ్యక్తిగత సమాచారాన్ని అప్‌లోడ్ చేయడం ద్వారా డిజిటల్ డేటా అభద్రతా గురవుతుందని పోలీసు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఎపికె ఫైల్స్ డౌన్‌లోడ్, ఏఐ మార్ఫింగ్ ప్రమాదాలు
ఈ ట్రెండ్ పేరుతో సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారమవుతున్న అనుమానాస్పద ఎపికె (APK) ఫైల్స్‌ను లేదా థర్డ్-పార్టీ యాప్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వీటిని ఇన్‌స్టాల్ చేయడం ద్వారా ఫోన్‌లోని వ్యక్తిగత ఫోటోలు, రహస్య డేటా హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందన్నారు. అంతేకాకుండా, మీరు అప్‌లోడ్ చేసే ఫోటోలను కృత్రిమ మేధ (AI) టూల్స్ ద్వారా మార్ఫింగ్ చేసి, నకిలీ ఫోటోలు లేదా వీడియోలుగా మార్చి భవిష్యత్తులో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడే అవకాశముందని సైబర్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు.
బాధితులు వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి
వ్యక్తిగత భద్రతే మొదటి ప్రాధాన్యత అని, ట్రెండ్ల కంటే డిజిటల్ సేఫ్టీకి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఇతరుల ఫోటోలను కూడా వారి అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదని ఆదేశించారు. ఇప్పటికే ఏవైనా అనుమానాస్పద యాప్‌లను ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసి ఉంటే వాటిని తక్షణమే అన్‌ఇన్‌స్టాల్ చేసి, డిజిటల్ బ్యాంకింగ్, సోషల్ మీడియా ఖాతాల భద్రతను తనిఖీ చేసుకోవాలని కోరారు. ఒకవేళ ఏమైనా సైబర్ మోసాలు జరిగితే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని లేదా సమీపంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- కువైట్ లైబ్రరీ ప్రాజెక్టులపై సమీక్ష.. ఆక్స్ఫర్డ్ తో చర్చలు..!!
- సౌదీపై దాడుల ఎఫెక్ట్.. ఇరాక్‌లో మైసాన్ ఆపరేషన్స్ కమాండర్ తొలగింపు..!!
- 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక!
- ఏ దేశానికి BRICS కూటమి వ్యతిరేకం కాదు: ప్రధాని మోదీ
- ఇక విదేశాల్లోనే ఫుడ్ హ్యాండ్లర్ పరీక్ష.. ఖతార్ కీలక నిర్ణయం..!!
- ఒమన్‌లో అక్రమ ప్రవేశాల వైరల్ వీడియోపై ROP క్లారిటీ..!!
- బహ్రెయిన్‌లో ఆహార వృథాను తగ్గించేందుకు పిలుపు..!!
- యూఏఈ స్కూళ్లలో వాట్సాప్ గ్రూపులకు కొత్త రూల్స్..!!
- ఖతార్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి సుల్తాన్ అల్ మురైఖీతో భారత రాయబారి శ్రీకర్ రెడ్డి భేటీ
- BRICS సదస్సులో ప్రధాని మోదీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ ద్వైపాక్షిక భేటీ







