‘అలియాస్ రుక్మిణీ’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

- September 12, 2026 , by Maagulf
‘అలియాస్ రుక్మిణీ’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ అద్భుత విజయం తర్వాత న్యాచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్స్, నితిన్ హీరో నటిస్తున్న ‘అలియాస్ రుక్మిణీ’ సరికొత్త ప్రాజెక్ట్‌తో  వస్తోంది. తన తొలి చిత్రం ‘దండోరా’తో విమర్శకులను ఆకట్టుకున్న మురళీకాంత్ దేవసోత్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. దీప్తి గంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఒక ఆసక్తికరమైన కథతో కూడిన విలక్షణమైన ప్రపంచాన్ని ఆవిష్కరించేలా ఉంటుంది.

‘అలియాస్ రుక్మిణి’ 10 రోజుల మొదటి షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. చిత్ర బృందం ప్రధాన తారాగణంతో కూడిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించింది. ఈ షూట్‌లో హీరో నితిన్‌తో పాటు సాయి కుమార్, హర్ష వర్ధన్, ఇతర ప్రముఖ నటులు పాల్గొన్నారు.

యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నాని సమర్పకుడిగా వ్యవహరించడం ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెంచుతోంది. లైట్ హార్ట్ హాస్యంతో కూడిన గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమాలో నితిన్ చాలా యూనిక్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.  

ఈ చిత్రానికి జోమోన్ టి. జాన్ ఐఎస్‌సి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా, విజయ్ బల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా, సృజన అడుసుమిల్లి ఎడిటింగ్.  

తారాగణం: నితిన్, సాయి కుమార్, హర్ష వర్ధన్

సాంకేతిక సిబ్బంది:
సమర్పణ: నేచురల్ స్టార్ నాని
ప్రొడక్షన్ బ్యానర్: యూనానిమస్ ప్రొడక్షన్స్
రచన, దర్శకత్వం: మురళీ కాంత్ దేవాసోత్
నిర్మాత: దీప్తి గంటా
సినిమాటోగ్రఫీ: జోమోన్ T. జాన్ ISC
సంగీతం: విజయ్ బుల్గానిన్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రశాంత్ మండవ
కాస్ట్యూమ్ డిజైనర్: రేఖ బొగ్గర్రపు
పబ్లిసిటీ డిజైనర్: భరణిధరన్
మార్కెటింగ్: ఫస్ట్ షో
PRO: వంశీ-శేఖర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com