రాష్ట్రపతి ముర్ముతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ భేటీ
- September 12, 2026
భారత్–ఇరాన్ స్నేహ సంబంధాలు, సాంస్కృతిక బంధాలపై చర్చ
న్యూఢిల్లీ: ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్లో కలిశారు. ఈ సందర్భంగా భారత్–ఇరాన్ మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న స్నేహ సంబంధాలు, ఇరు దేశాల మధ్య బలమైన సాంస్కృతిక, ప్రజా సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించారు.
భారత్, ఇరాన్ మధ్య చారిత్రకంగా కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాలను ఇరువురు నేతలు గుర్తు చేసుకున్నారు. ప్రజల మధ్య పరస్పర సంబంధాలు, సాంస్కృతిక అనుబంధాలు ఇరు దేశాల మధ్య సంబంధాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. సంభాషణ, దౌత్య మార్గాల ద్వారా శాశ్వత శాంతిని సాధించేందుకు భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో శాంతి, స్థిరత్వం కోసం చర్చలు, దౌత్యపరమైన పరిష్కారాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని ఇరువురు నేతల భేటీ మరోసారి స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- రాష్ట్రపతి ముర్ముతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ భేటీ
- చిన్నారి కోరిక తీర్చిన దుబాయ్ పోలీస్.. హట్టా స్మార్ట్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక అనుభవం
- BRICS సమ్మిట్ తొలిరోజు అద్భుత దృశ్యం
- మచిలీపట్నంలో సాగర తీర మహాగణపతి ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- అస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డు 2026 విజేతగా అగిమోల్ ప్రదీప్
- పదవి కాదు.. దేశ సేవే ప్రధాని మోదీ లక్ష్యం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- రూ.204 కోట్లు విరాళం.. అయినా చాలామందికి తెలియని పేరు..రోహిణి నీలేకణి సేవా ప్రస్థానం
- మహిళల ఆసియా కప్ ఫైనల్‌కు ముందు ట్రోఫీతో భారత్, శ్రీలంక కెప్టెన్లు
- బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడితో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ భేటీ
- ఖతార్: నిఖత్ జరీన్‌కు భారత రాయబారి డా.శ్రీకర్ రెడ్డి చేతుల మీదుగా ఘన సత్కారం







