బహ్రెయిన్‌లో ఆరు డ్రగ్స్ కేసులు.. 10 మంది అరెస్ట్..!!

- September 15, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో ఆరు డ్రగ్స్ కేసులు.. 10 మంది అరెస్ట్..!!

మనామా: బహ్రెయిన్‌లో డ్రగ్స్‌ అక్రమ రవాణా, వినియోగంపై అధికారులు చేపట్టిన చర్యల్లో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు వేర్వేరు డ్రగ్స్‌ కేసుల్లో సుమారు 14 కిలోల మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ డైరెక్టరేట్ తెలిపిన వివరాల ప్రకారం.. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ సుమారు BD116,000 (బహ్రెయిన్ దినార్)గా అంచనా వేశారు.

బహ్రెయిన్‌లో డ్రగ్స్‌ సంబంధిత నేరాలను అరికట్టడంతో పాటు ప్రజల భద్రతను కాపాడేందుకు కొనసాగుతున్న చర్యల్లో భాగంగానే ఈ అరెస్టులు, స్వాధీనం చేసుకోవడం జరిగిందని అధికారులు తెలిపారు. అరెస్టయిన వారిపై తదుపరి చట్టపరమైన చర్యలు* చేపట్టనున్నట్లు వెల్లడించారు. దేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పంపిణీపై భద్రతా సంస్థలు నిఘాను మరింత పెంచుతున్నాయని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com